నవతెలంగాణ – వాషింగ్టన్: పాలక డెమోక్రటిక్ పార్టీకి చెందిన భారతీయ అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు రో ఖన్నా (47) మున్ముందు అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేసే అవకాశం ఉందని ఆయన సహచరులు భావిస్తున్నారు. వాషింగ్టన్‌లో గురువారం ఇండియన్ అమెరికన్ ఇంపాక్ట్ చర్చా వేదికలో ఏబీసీ విలేకరి జోహ్రీన్ షా భారత సంతతి అమెరికన్ కాంగ్రెస్ సభ్యులను.. రో ఖన్నా అమెరికా అధ్యక్ష పదవికి పోటీచేసే విషయమై ఆరా తీయగా… ‘అవును, అవునంటూ ఠాణేదార్, ప్రమీలా జయపాల్ వ్యాఖ్యానించారు. సిలికాన్ వ్యాలీ నుంచి అమెరికా పార్లమెంటుకు ఎన్నికైన రో ఖన్నా.. ‘ఏమో ఎలా చెప్పగలం’ అని అంటూనే…. బహుశా ఒక దశాబ్ద కాలంలో అధ్యక్ష పదవికి పోటీ చేయవచ్చునని స్పందించారు. ఆయనకు తోడు చర్చలో పాల్గొన్న ముగ్గురు భారతీయ అమెరికన్ సభ్యులు కూడా సానుకూలమైన స్పందననే కనబరిచారు.