లండన్‌కు భారత క్రికెటర్లు

లండన్‌ : ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ కోసం భారత క్రికెటర్లు శనివారం లండన్‌కు చేరుకున్నారు. మూడు బృందాలుగా ఇంగ్లాండ్‌కు చేరుకున్న భారత టెస్టు క్రికెట్‌ జట్టు.. శనివారం వరకు అరుండెల్‌ క్యాసిల్‌ క్రికెట్‌ క్లబ్‌లో సాధన చేసింది. ఐసీసీ డబ్ల్యూటీసీ ఫైనల్‌ లండన్‌లోని ది ఓవల్‌ మైదానంలో జరుగనుంది. జూన్‌ 7-11 వరకు టెస్టు క్రికెట్‌ అంతిమ సమరంలో భారత్‌, ఆస్ట్రేలియా తలపడనున్నాయి. ఆస్ట్రేలియా క్రికెట్‌ జట్టు ఇప్పటికే లండన్‌లో ప్రాక్టీస్‌ చేస్తుండగా.. భారత క్రికెటర్లు శనివారం లండన్‌కు వచ్చారు. ఇక్కడ భారత జట్టు మరో మూడు రోజులు పూర్తి స్థాయి సాధన చేయనుంది. మ్యాచ్‌ పరిస్థితులను తలపించే ప్రాక్టీస్‌ సెషన్‌, జట్టు అంతర్గత ప్రాక్టీస్‌ మ్యాచులు ఆడేందుకు జట్టు మేనేజ్‌మెంట్‌ ప్రణాళికలు రచించినట్టు సమాచారం.

Spread the love