నవతెలంగాణ – హైదరాబాద్: ఒలింపిక్స్ 2024లో భారత షూటర్ రమితా జిందాల్ ఫైనల్‌కు దూసుకెళ్లారు. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగం క్వాలిఫికేషన్ రౌండ్‌లో 5వ స్థానంలో నిలిచి తుదిపోరుకు అర్హత సాధించారు. ఇదే విభాగంలో ఎలవెనిల్ వలరివన్ 10వ స్థానంలో నిలవడంతో ఫైనల్లో అడుగు పెట్టలేకపోయారు. టాప్-8లో స్థానం సాధించిన వారు మాత్రమే ఫైనల్‌కు వెళ్తారు.