– ఖోఖో ప్రపంచకప్
న్యూఢిల్లీ: ఖోఖో ప్రపంచకప్ ఫైనల్లోకి భారత జట్లు దూసుకెళ్లాయి. శుక్రవారం జరిగిన క్వార్టర్‌ఫైనల్లో భారతజట్లు ఏకపక్ష పోరులో ప్రత్యర్ధి జట్లను చిత్తుచేశాయి. ముఖ్యంగా భారత మహిళలజట్టు క్వార్టర్‌ఫైనల్లో 109-14పాయింట్ల తేడాతో బంగ్లాదేశ్‌పై ఘన విజయం సాధించింది. కెప్టెన్ ప్రియాంక అద్భుత ప్రదర్శనతో అదరగొట్టింది. ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న ఖోఖో ప్రపంచకప్ పోటీల్లో వారం రోజులుగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక పురుషుల జట్టు శ్రీలంకను చిత్తుచేసింది. ఇతర క్వార్టర్‌ఫైనల్ పోటీల్లో ఇరాన్ జట్టు 86-18పాయింట్ల తేడాతో కెన్యాను ఓడించి సెమీస్‌కు చేరగా.. మహిళల విభాగంలో ఉగాండా జట్టు 71-26పాయింట్ల తేడాతో న్యూజిలాండ్‌ను, దక్షిణాఫ్రికా జట్టు హోరాహోరీ పోరులో 51-46పాయింట్ల తేడాతో కెన్యాను ఓడించి సెమీస్‌కు చేరాయి.