– ప్రముఖ ఆర్థికవేత్త అమర్త్యసేన్
న్యూఢిల్లీ : హిందువులు, ముస్లింలు కలిసి మెలిసి జీవించే సంప్రదాయం భారత్‌లో ఉన్నదని ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ గ్రహీత అమర్త్యసేన్ అన్నారు. అలీపూర్ జైలు మ్యూజియంలో నిరుపేద యువతలో పుస్తక పఠన అలవాట్లను పెంపొందించేం దుకు జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ”మన దేశ చరిత్రను పరిశీలిస్తే.. హిందువులు, ముస్లింలు యుగయుగాలుగా సంపూర్ణ సమన్వయంతో సామరస్యంతో కలిసి పనిచేస్తున్నారు. ఇది ‘జుక్తోసాధన’ అని క్షితిమోహన్ సేన్ తన పుస్తకంలో నొక్కిచెప్పారు. ఈ ‘జుక్తోసాధన’ ఆలోచనను మనం నొక్కి చెప్పాలి” అని ఆయన అన్నారు. ”మీరు ఉస్తాద్ అలీ అక్బర్ ఖాన్, పండిట్ రవిశంకర్‌ల మధ్య వారి మతపరమైన గుర్తింపులను వేరు చేయగలరా? వారి స్వంత శాస్త్రీయ సంగీత శైలి కోసం వారిని వేరు చేయవచ్చు” అని ఆయన అన్నారు. భారతదేశ బహువచన లక్షణాన్ని అణచివేసే ప్రయత్నాలకు వ్యతిరేకంగా హెచ్చరిస్తూ, ఉపనిషత్తులను పార్సీలోకి అనువదించిన కొద్దిమందిలో ముంతాజ్ కుమారుడు దారా షికో ఒకడని అమర్త్యసేన్ చెప్పారు. ఆయన హిందూ గ్రంధాలు, సంస్కృత భాషలో చాలా ప్రావీణ్యం కలిగి ఉన్నాడని ఇది చూపిస్తున్నదని అన్నారు. ”తాజ్ మహల్ చాలా అందంగా కనిపించటం, చాలా గొప్పతనాన్ని కలిగి ఉండటం పట్ల ఒక అభిప్రాయం వ్యతిరేకించగా, స్మారక చిహ్నం పేరును ముస్లిం పాలకులతో సంబంధం లేకుండా మార్చాలని కోరుకునే మరొక వర్గమున్నదని ఆయన తెలిపారు.