నవతెలంగాణ – ముంబాయి: ఉమెన్స్ ఎమర్జింగ్ ఆసియా కప్‌ను భారత మహిళల ఏ జట్టు విజయంతో ఆరంభించింది. తొలి మ్యాచ్‌లో పసికూన హాంకాంగ్‌పై 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఆల్‌రౌండర్ శ్రేయాంక పాటిల్) సంచలన బౌలింగ్ ప్రదర్శన చేసింది. కేవలం రెండే పరుగులు ఇచ్చి 5 వికెట్లు పడగొట్టింది. దాంతో, హాంకాంగ్ 14 ఓవర్లలో 34 పరుగులకే ఆలౌట్ అయింది. ఆ జట్టులో ఓపెనర్ మరికో హిల్స్ (19 బంతుల్లో 14 రన్స్) టాప్ స్కోరర్. స్వల్ప లక్ష్యాన్ని భారత మహిళల జట్టు 5.2 ఓవర్లలో వికెట్ కోల్పోయి ఛేదించింది. తెలుగు అమ్మాయి త్రిష 19 పరుగులతో నాటౌట్‌గా నిలిచింది.ఆల్‌రౌండర్‌గా రాణిస్తున్న శ్రేయాంక పాటిల్ మహిళల ప్రీమియర్ లీగ్ తొలి సీజన్లో మెరిసింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఆడిన ఆమె అద్భుత ప్రదర్శన చేసింది. 5 వికెట్లు తీసింది. బ్యాటింగ్‌లోనూ సత్తా చాటి 68 పరుగులు చేసింది. బీసీసీఐ తొలిసారి నిర్వహించిన డబ్ల్యూపీఎల్‌లో ముంబై ఇండియన్స్ చాంపియన్‌గా అవతరించింది. ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై అద్భుత విజయం సాధించి ట్రోఫీని సొంతం చేసుకుంది.