ఉద్యోగాల పేరుతో మోసం.. భారతీయులు కాంబోడియాలో ఆందోళన

నవతెలంగాణ – హైదరాబాద్: విదేశాల్లో ఉద్యోగం, భారీ మొత్తంలో వేతనం అంటూ ప్రకటనలు గుప్పించి ఆకర్షించడం.. నమ్మిన వాళ్లను దేశంకాని దేశంలో మోసం చేయడం వంటి ఉదంతాలు ఇటీవల పెరుగుతున్నాయి. తాజాగా ఇలాంటిదే మరో సంఘటన వెలుగులోకి వచ్చింది. ఏకంగా 300 మంది భారతీయులు కాంబోడియాలో ఆందోళనకు దిగడంతో అక్కడి భారత రాయబార కార్యాలయం స్పందించింది. మోసపోయిన వారిలో 60 మందిని కాపాడింది. ఇందులో సగం మంది విశాఖపట్నం వాసులేనని సమాచారం. బాధితులు, ఎంబసీ అధికారులు చెప్పిన వివరాల ప్రకారం.. కాంబోడియాలో డాటా ఎంట్రీ, కస్టమర్ సపోర్ట్ ఉద్యోగాలు ఉన్నాయని, పెద్దమొత్తంలో వేతనం పొందొచ్చని ఏజెంట్లు చెప్పడంతో నమ్మి మోసపోయామన్నారు. ఏజెంట్లకు భారీ మొత్తం చెల్లించి కాంబోడియాకు వచ్చామని వివరించారు. తీరా ఇక్కడికి వచ్చాక చైనా కంపెనీల ఫేక్ కాల్ సెంటర్ లో కూర్చోబెట్టి భారతీయులపై సైబర్ నేరాలకు పాల్పడాలని నిర్భందిస్తున్నారని చెప్పారు.

Spread the love