బంగ్లాదేశ్‌లో హైకమిషన్‌పై భారత్‌ కీలక నిర్ణయం

India's key decision on High Commission in Bangladeshనవతెలంగాణ – బంగ్లాదేశ్‌
బంగ్లాదేశ్‌లో రాజకీయ సంక్షోభం నెలకొన్న క్రమంలో బంగ్లాదేశ్‌లోని  హైకమిషన్‌, కాన్సులేట్స్‌ నుంచి అత్యవసరం కాని సిబ్బందిని, వారి కుటుంబాలను ఢాకా నుంచి వెనక్కిపిలిపించాలని భారత్‌ నిర్ణయించింది. అయితే హైకమిషన్‌లో దౌత్యవేత్తలు, హైకమిషన్‌ యధావిధిగా పనిచేస్తుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. కాగా బంగ్లాదేశ్‌లో అల్లర్ల నేపధ్యంలో 199 మంది ప్రయాణీకులు, ఆరుగురు శిశువులతో కూడిన ఎయిర్‌ ఇండియా విమానం ఢాకా నుంచి ఈరోజు ఉదయం ఢిల్లీ చేరుకుంది.పొరుగు దేశం బంగ్లాదేశ్‌లో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మొదలైన విద్యార్థుల ఉద్యమం హింసాత్మకంగా మారింది. వేలాది మంది నిరసనకారులు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో రాజకీయ సంక్షోభంలో చిక్కుకున్న బంగ్లాదేశ్‌లో విద్యార్థుల మాటున అరాచక శక్తులు పేట్రేగిపోతున్నాయి. దేశవ్యాప్తంగా బీభత్సం సృష్టిస్తున్నాయి. బంగ్లాదేశ్‌లో హిందూ దేవాలయాలు, వ్యాపార సంస్ధలు, ఇండ్లు లక్ష్యంగా జరుగుతున్న దాడులను ఆథ్యాత్మిక వేత్త సద్గురు జగ్గీ వాసుదేవ్‌ బుధవారం తీవ్రంగా ఖండించారు.

Spread the love