నవతెలంగాణ – హైదరాబాద్: బంగ్లాతో టెస్ట్ సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన భారత్ అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకుంది. ఒకే క్యాలెండర్ ఇయర్‌లో టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదిన తొలి జట్టుగా రికార్డు సృష్టించింది. 90 సిక్సర్లు నమోదు చేసి ఇంగ్లండ్(89)ను అధిగమించింది. అలాగే టెస్ట్ ఫార్మాట్‌లో అత్యంత వేగంగా 50, 100, 200, 250 పరుగుల రికార్డును సాధించిన తొలి జట్టుగా నిలిచింది.