ఇండిగో ఎయిర్ లైన్స్ బంపర్‌ ఆఫర్‌..

నవతెలంగాణ -హైదరాబాద్: భారత దేశంలోనే అతి పెద్ద ఎయిర్ లైన్స్ సంస్థ ఇండిగో ఎయిర్ లైన్స్ ప్రయాణికులకు అదిరిపోయే ఆఫర్ ను ప్రకటించారు.. విమాన టిక్కెట్లను బుక్ చేసుకునే వ్యక్తులకు కంపెనీ రూ. 2000 వరకు తగ్గింపును ఇస్తోంది..ఈ సేల్ మూడు రోజుల పాటు కొనసాగనుంది. ఇండిగో కార్యకలాపాలు ప్రారంభించి 17 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కంపెనీ ‘యానివర్సరీ సేల్’ను ప్రారంభించింది. దాని పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈ కంపెనీ ఆఫర్ ఆగస్టు 2 నుంచి 4 వరకు ఉంటుంది. అటువంటి పరిస్థితిలో ఈ కాలంలో విమాన టిక్కెట్లను బుక్ చేసుకునే వారికి, తగ్గింపు ధరపై రూ.2000 వరకు తగ్గింపు లభిస్తుంది. ఈ తగ్గింపు అన్ని రకాల కస్టమర్లకు అందుబాటులో ఉంటుంది. కంపెనీ ఈ ఆఫర్‌కి ‘HappyIndiGoDay’ అని పేరు పెట్టింది.. ఈ సంస్థకు సంబందించిన విమాన టికెట్ లను మొబైల్, వెబ్ సైట్ నుంచి కొనుగోలు చేసేవారికి అన్ని టిక్కెట్‌లపై 12 శాతం తగ్గింపును అందిస్తోంది. ఈ తగ్గింపు ఆగస్టు 3 వరకు అందుబాటులో ఉండగా, ఆగస్టు 4న టికెట్ బుక్‌పై 7 శాతం తగ్గింపు మాత్రమే అందుబాటులో ఉంటుంది. తగ్గింపు పరిమితి రూ.2,000 వరకు ఉంటుంది..

Spread the love