నవతెలంగాణ-ధర్మసాగర్
ముస్లిం సోదరులకు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపిన స్టేషన్గన్పూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ సింగపురం ఇందిర. గురువారం బక్రీద్ పండగ కార్యక్రమాన్ని పురస్కరించుకొని మండల కేంద్రంలోని కాసిగూడం గ్రామంలో మసీదులో ముస్లిం మత పెద్దలకు మరియు ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపి ఆత్మీయంగా మాట్లాడారు. అనంతరం కాలనీవాసులు ఆమెకు శాలువాతో సత్కరించి సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో మైనారిటీ మత పెద్దలు, జిల్లా నాయకులు ,మండల అధ్యక్షులు, మాజీ ప్రజా ప్రతినిధులు సీనియర్ నాయకులు ప్రజా ప్రతినిధులు, గ్రామ శాఖ అధ్యక్షులు మరియు మండల ముఖ్య నాయకులు అనుబంధ సంఘాల అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ముస్లిం సోదరులు తదితరులు పాల్గొన్నారు.