ఇండ్కల్ టెక్నాలజీస్ తన 2024 శ్రేణి ఏసర్ ఎయిర్ కండీషనర్‌

నవతెలంగాణ-హైదరాబాద్ : భారతదేశంలోని ఏసర్ గృహోపకరణాల కోసం అధికారిక అనుమతులు ఇండ్కల్ టెక్నాలజీస్ ప్రయివేటు లిమిటెడ్, అందరూ ఆసక్తిగా వేచి చూస్తున్న 2024 శ్రేణి ఏసర్ ఎయిర్ కండీషనర్‌లను విడుదల చేయడం పట్ల తన సంతోషాన్ని వ్యక్తం చేసింది. హోమ్ కూలింగ్ అనుభవాలను పునర్నిర్వచించేందుకు రూపొందించిన ఈ ఎయిర్ కండీషనర్లను 1.0 టన్ను- 3 మరియు 5 స్టార్, 1.5 టన్ను – 3 మరియు 5 స్టార్, మరియు 2.0 టన్ను – 3 స్టార్ కెపాసిటీలలో అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆర్కిటిక్ ర్యాప్ కూలింగ్‌తో సహా ఐ సెన్స్, కూల్‌స్పియర్ ఎయిర్‌ఫ్లో మేనేజ్‌మెంట్ తదితర అత్యాధునిక సాంకేతికతలను ఈ ఉత్పత్తుల శ్రేణుల్లో ఉన్నాయి. ఇది లీనమయ్యే వినియోగదారు అనుభవానికి ప్రాధాన్యతనిచ్చే, కొత్త శ్రేణి ఎయిర్ కండీషనర్లు దేశవ్యాప్తంగా ఆఫ్‌లైన్ రిటైల్ ఛానెళ్లలో విడుదలై అందుబాటులోకి వచ్చాయి. భారతదేశంలో మొట్టమొదటిసారిగా, పరిశ్రమలో మొదటి ఫీచర్‌గా, ఏసర్ ఎయిర్ కండిషనర్లు 7-ఇన్-1 కన్వర్టిబుల్ టెక్నాలజీని కలిగి ఉన్నాయి. ఇది వినియోగదారులు తమ అవసరాలకు అనుగుణంగా శీతలీకరణను మార్చుకునేందుకు, స్వీకరించేందుకు అనుమతిస్తుంది. దీనికి అదనంగా, ఏసీలు ఆర్కిటిక్ ర్యాప్ కూలింగ్‌ సదుపాయాన్ని కలిగి ఉండగా, ఇది 55 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతల వరకు శక్తివంతమైన, విశ్వసించదగిన శీతలీకరణను అందిస్తుంది. ఏసర్ ఏసీలు ఇంటెలిజెంట్ ఏఐ సెన్స్ టెక్నాలజీ ఈ పరికరాలను వినియోగదారుని ప్రాధాన్యతలకు అనుగుణంగా, పరిసర ఉష్ణోగ్రత ఆధారంగా శీతలీకరణ సెట్టింగ్‌లను ఆప్టిమైజ్ చేసే అనుకూల శీతలీకరణ మేధస్సును అందించేందుకు అనుమతిస్తుంది. మొత్తం ఇంధన వినియోగం, విద్యుత్ బిల్లులను తగ్గిస్తుంది మరియు తక్కువ శబ్దంతో ఏసీ పని చేసేలా చేస్తుంది. కూల్‌స్పియర్ ఎయిర్‌ఫ్లో జీవన ప్రదేశంలో సాధ్యమైనంత ఉత్తమమైన శీతలీకరణ వాతావరణాన్ని అందించేందుకు, దాని 3డీ కూలింగ్ డైవ్‌తో సౌకర్యాన్ని అందిస్తుంది. ఈ ఏసీలు సొగసైన, మినిమలిస్టిక్ అప్పీల్‌తో, సౌందర్య రూపకల్పనకు అనుగుణంగా ఆవిష్కరణకు సరైన ఉదాహరణ అని చెప్పవచ్చు. ముఖ్యంగా, ఒక డిజైన్ ఎర్గోనామిక్ ఎల్‌ఇడి డిస్‌ప్లేను కలిగి ఉండగా, ఇది భారతీయ మార్కెట్లో అటువంటి ఫీచర్‌ను కలిగి ఉన్న మొదటి ఉత్పత్తికి ఉదాహరణ అని చెప్పవచ్చు. ఇండ్కల్ టెక్నలాజీస్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈఓ ఆనంద్ దూబే, వీటి విడుదల పట్ల తన సంతోషాన్ని పంచుకుంటూ, ‘‘సాంకేతికంగా అధునాతనమైన వాటిని అందించే మా లక్ష్యంలో గణనీయమైన పురోగతిని సూచిస్తున్న ఏసర్ ఎయిర్ కండీషనర్‌ల 2024 శ్రేణిని పరిచయం చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. భారతదేశం వ్యాప్తంగా, గృహాలకు నమ్మకమైన శీతలీకరణ పరిష్కారాలను ఇవి అందిస్తాయి. ఆవిష్కరణ, వినియోగదారుని సంతృప్తి పట్ల మా అంకితభావం నిరంతరం సరిహద్దులను, అంచనాలను అధిగమించే దిశలో మమ్మల్ని ముందుకు నడిపిస్తుంది’’ అని పేర్కొన్నారు. కంపెనీ దృష్టి కోణాన్ని దూబే మరింత విశదీకరిస్తూ, ‘‘ఇండ్కల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్‌లో, మేము అసాధారణమైన ఉత్పత్తులను అందించడమే కాకుండా, మా వినియోగదారులు అవసరమైనప్పుడు వేగవంతంగా, వ్యక్తిగతీకరించిన సహాయాన్ని పొందేలా చేసే సమగ్ర సేవా నెట్‌వర్క్‌ అవసరాన్ని అర్థం చేసుకుని దాన్ని ఏర్పాటు చేసేందుకు కట్టుబడి ఉన్నాము. విశ్వసనీయత, మనశ్శాంతి ప్రాముఖ్యత మరియు మా వ్యాపారం ప్రతి అంశంలో ఈ విలువలను నిలబెట్టడానికి మేము ప్రయత్నిస్తాము’’ అని వివరించారు. స్థానిక తయారీ, అనుకూలత పట్ల కంపెనీ నిబద్ధతను హైలైట్ చేస్తూ, 2024 శ్రేణిలోని అన్ని మోడళ్లు భారతదేశంలోనే తయారు చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న విభిన్న వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా రూపొందించబడిన ఈ ఎయిర్ కండీషనర్లు అత్యుత్తమ పనితీరు, మన్నికకు హామీ ఇస్తాయి.

Spread the love