అనాధ శవానికి అంత్యక్రియలు నిర్వహించిన ఇందూరు యువత స్వచ్చంద సేవా సంస్థ

నవతెలంగాణ- కంటేశ్వర్: గత వారం రోజుల క్రితం ఆనారోగ్యంతో మృతిచెందిన గుర్తు తెలియని ఓ అనాధ శవానికి అంత్యక్రియలు నిర్వహించమని 3వ ఠాణా పోలిస్ సిబ్బంది కోరగా సోమవారం ఇందూరు యువత స్వచ్చంద సేవా సంస్థ ఆద్వర్యంలో దేవి టాకీస్ చౌరస్తా వద్ద గల సార్వజనిక్ స్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించడం జరిగిందని ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ మద్దుకూరి సాయిబాబు అన్నారు. ఈ కార్యక్రమంలో ఇందూరు యువత ఈసి మెంబర్ కాసుల సాయితేజ, జయదేవ్, 3వ ఠాణా పోలిస్ సిబ్బంది సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love