సాగు విస్తీర్ణం అనుగుణంగా పరిశ్రమలు ఏర్పాటు చేస్తాం…

– జిల్లాకో ఇరువురు కోఆర్డినేటర్ నియామకం….
– ఈ ఏడాది ఓ ఈ ఆర్ 19.03 శాతం నిర్ధారణ…
నవతెలంగాణ – అశ్వారావుపేట
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇప్పటివరకు 88 వేల ఎకరాల్లో (ఖమ్మం లో 24 వేల ఎకరాలు, భద్రాద్రి కొత్త గూడెంలో 64 వేల ఎకరాలు) పామాయిల్ తోటలు విస్తరించి ఉన్నాయని ఆయిల్ఫెడ్ ఎండీ సురేందర్ రెడ్డి అన్నారు. శనివారం ఆయన ఆయిల్ఫెడ్ జనరల్ మేనేజర్ సుధాకర్ రెడ్డితో కలిసి అప్పారావుపేట, అశ్వారావుపేటలోని నిర్మాణంలో ఉన్న ఫాం ఆయిల్ ప్యాక్టరీలను సందర్శించారు. ఫ్యాక్టరీ వార్షిక నిర్వహణ పనులను ఆయన పరిశీలించారు. అనంతరం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ వచ్చే మార్చి నాటి కల్లా కొత్త గూడెం జిల్లాలో 12,500 ఎకరాలు, ఖమ్మం లో 8 వేల ఎకరాలు పామాయిల్ సాగును విస్తరించాలని నిర్ణయించినట్టు ఆయన తెలిపారు.ఉమ్మడి జిల్లాలో 11 నర్సరీల లో మొక్కలు సిద్ధంగా ఉన్నాయన్నారు. ఇక నుండి ప్రతి ఏటా ఖమ్మం లో 5 వేల ఎకరాలు, కొత్తగూడెం జిల్లాలో 10 వేల ఎకరాల్లో తోటలు వేయాలనే లక్ష్యంతో పనిచేస్తా మన్నారు.అశ్వారావుపేట లో 30 టన్నుల సామర్థ్యంతో నిర్మించే పామాయిల్ ఫ్యాక్టరీ వచ్చే ఏడాది చివరికల్లా పూర్తి చేయనున్నట్లు ఆయన తెలిపారు. కల్లూరులో నిర్మించబోయే ప్యాక్టరీలను పనులను వచ్చే సెప్టెంబర్ లో ప్రారంభించనున్నట్లు తెలిపారు. సిద్ధిపేట, మహబూబాబాద్, గజ్వేల్, జనగాం, నారాయణ్ పేట్ జిల్లాల్లో 10 వేల ఎకరాల్లో పామాయిల్ ప్లాంటేషన్ లు వేయడం జరిగిందని,ఇవి దిగుబడులు వచ్చేసరికి సిద్ధిపేట ప్యాక్టరీని పూర్తి చేస్తామన్నారు.జిల్లాలో ప్లాంటేషన్ మానిటరింగ్ చేసేందుకు ప్రతి జిల్లాకు ఇద్దరేసి చొప్పున మానిటరింగ్ అధికారులను నియమిస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది 19.02 ఆయిల్ రివకరి శాతం వచ్చినట్టు ఆయన తెలిపారు.గత ఏడాది కంటే తగ్గడానికి కారణం చెపుతూ వాతావరణం అసమతుల్యత వల్ల ఆయిల్ రికవరీ శాతం తగ్గిందని ఆయన చెప్పారు. కేం ద్ర ప్రభుత్వం ప్రకటించిన ఎం ఓ యు లో ఒప్పందం కుదుర్చుకుంటే రైతులకు నష్టం జరిగే అవకాశాలున్నాయనే ఉద్దేశంతో అందులో ఆయిల్ఫెడ్ ఒప్పందాన్ని నిరాకరించడం జరిగిందన్నారు. ఎం ఓ యు కుదుర్చుకునే సమయంలో ప్రభుత్వం గత ఐదేళ్ళ సరాసరి న పరిగణనలోకి తీసుకుంటుందని, 2020 – 21 సం.లలో కోవిడ్, ఇజ్రాయిల్ యుద్ధం కారణంగా నూనె ధరలు విపరీతంగా పెరిగాయని అందులో అప్పట్లో ఫామాయిల్ కు అత్యధిక ధరలు వచ్చాయని,మరో రెండు సంవత్సరాలు పోతే సరాసరి ధర తగ్గిపోయి ఎం ఓ య లో నిర్ణయించిన దానికంటే సాధారణ ధరే ఎక్కువగ ఉండే అవకాశాలున్నాయని పామాయిల్ రైతులకు మంచి భవిష్యత్ ఉందని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు.వాతావరణ అసమతుల్యత ప్రభావం పంటలపై ఉండకుండా ఇప్పటి నుండే రైతులు నీటి తడులు తరుచు ఇవ్వాలని‌ సూచించారు. కార్యక్రమంలో పి అండ్ పి మేనేజర్ శ్రీకాంత్ రెడ్డి, ఇంజనీరింగ్ విభాగం మేనేజర్ జన్ను సత్యనారాయణ,డివిజనల్ ఆఫీసర్ ఆకుల బాల క్రిష్ణ,అప్పారావు పేట, అశ్వారావుపేట మేనేజర్ లు కళ్యాణ్ గౌడ్, నాగబాబు, పవన్, గోపాల క్రిష్ణ,సిద్దు లు ఉన్నారు.
Spread the love