ఇన్ఫీ ప్రెసిడెంట్‌ మోహిత్‌ జోషి రాజీనామా

బెంగళూరు : దేశంలోనే రెండో అతిపెద్ద టెక్‌ కంపెనీ ఇన్ఫోసిస్‌ ప్రెసిడెంట్‌ మోహిత్‌ జోషి తన పదవికి రాజీనామా చేశారు. దాదాపు రెండు దశాబ్దాల నుంచి ఆయన ఇన్ఫీలో వివిధ హోదాల్లో పని చేశారు. త్వరలో ఆయన టెక్‌ మహీంద్రాలో ఎండి, సిఇఒగా చేరనున్నారు. ప్రస్తుతం టెక్‌ మహీంద్రా ఎండిగా ఉన్న సిపి గుర్నానీ 2023 డిసెంబర్‌ 19న పదవీ విరమణ పొందనున్నారు. మోహిత్‌ జోషి మార్చి 11 నుంచి సెలవులో ఉండగా.. ఈ ఏడాది జూన్‌ 9 వరకు కంపెనీలో కొనసాగనున్నారు. మోహిత్‌ ఇన్ఫోసిస్‌లో ఇప్పటి వరకు ఆయన యూరప్‌ కంపెనీకి సంబంధించి ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ బిజినెస్‌ను చూసుకున్నారు. 2000 సంవత్సరంలో ఇన్ఫోసిస్‌లో చేరారు.

Spread the love