25 నెలల కనిష్టానికి మే నెల ద్రవ్యోల్భణం

నవతెలంగాణ – హైదరాబాద్
కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ద్రవ్యోల్భణం మే నెలలో 25 నెలల గరిష్టాన్ని చేరుకొని 4.25 శాతంగా నమోదయింది. కేంద్ర బ్యాంకు ఆర్బీఐ లక్ష్యం 6 శాతం లోపు నమోదయింది. మే రిటైల్ ద్రవ్యోల్భణం ఏప్రిల్ నెల నాటి 4.7 శాతంతో పోలిస్తే తగ్గింది. అదే సమయంలో 2022 మే నెలలో రిటైల్ ద్రవ్యోల్భణం 7.04 శాతంగా నమోదయింది. కన్స్యూమర్ ఫుడ్ ప్రైస్ ఇండెక్స్ ఏప్రిల్ నెలలో 3.84 శాతం నమోదు కాగా, మే నెలలో 2.91 శాతానికి పరిమితమైంది. రూరల్ ద్రవ్యోల్భణం మే నెలలో 4.17 శాతంగా నమోదయింది. పట్టణ ద్రవ్యోల్భణం 4.27 శాతంగా ఉంది. మొత్తానికి మే నెలలో ఆహారం తదితర ఉత్పత్తుల ధరలు తగ్గాయి.

Spread the love