మింగిల్‌ కన్నా సింగిల్‌ బెటర్‌

Than Mingle Single is betterసితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నుంచి రాబోతున్న యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ ‘మ్యాడ్‌’. సూర్యదేవర నాగ వంశీ సమర్పిస్తున్న ఈ సినిమాతో సూర్యదేవర హారిక నిర్మాతగా, కళ్యాణ్‌ శంకర్‌ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఫార్చూన్‌ ఫోర్‌ సినిమాస్‌ పై సాయి సౌజన్య ఈ చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ వినోదాత్మక చిత్రంలో నార్నే నితిన్‌, సంగీత్‌ శోభన్‌, రామ్‌ నితిన్‌, శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, అనంతిక సనీల్‌కుమార్‌, గోపికా ఉద్యాన్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. గురువారం ఈ సినిమా నుంచి ‘ప్రౌడ్సే బోలో ఐ యామ్‌ సింగిల్‌’ అనే పాటను చిత్ర బందం విడుదల చేసింది. జీవితంలో మింగిల్‌ కాకుండా.. సింగిల్‌గా సంతోషంగా, గర్వంగా ఎలా ఉండవచ్చో ప్రధాన పాత్రలకు వివరిస్తున్నట్టుగా ఈ పాట సాగింది. ఈ సాంగ్‌లోని మ్యూజిక్‌ ఎవరితోనైనా కాలు కదిపించేలా ఉంది. ఇక సాహిత్యం యువత మెచ్చేలా.. ముఖ్యంగా లింగభేదాలు లేకుండా ప్రతి ఒక్కరినీ అలరిస్తోంది. ఈ పాట ప్రేక్షకుల్లో, ముఖ్యంగా యువతలో సినిమా చూడాలనే ఆసక్తిని రెట్టింపు చేసేలా ఉంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి అని చిత్రయూనిట్‌ తెలిపింది.
ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్‌ సిసిరోలియో, ఎడిటర్‌: నవీన్‌ నూలి, డీఓపీ: షామ్‌దత్‌ సైనుద్దీన్‌, దినేష్‌ కష్ణన్‌ బి, ఆర్ట్‌: రామ్‌ అరసవిల్లి, అడిషనల్‌ స్క్రీన్‌ ప్లే: ప్రవీణ్‌ పట్టు, ప్రణరు రావు తక్కళ్లపల్లి, ఫైట్‌ మాస్టర్‌: కరుణాకర్‌.

Spread the love