చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘విశ్వంభర’. వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. యూవీ క్రియేషన్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో చిరంజీవి సరసన త్రిష కష్ణన్ కథానాయిక. ఇటీవలే కొన్ని టాకీ పార్ట్‌లు, ఒక పాట, ఒక యాక్షన్ బ్లాక్‌ని చిత్రీకరించి షెడ్యూల్‌ను ముగించిన మేకర్స్, హైదరాబాద్‌లో కీలకమైన యాక్షన్ షెడ్యూల్‌ను ప్రారంభించారు. ఫైట్ మాస్టర్స్ ద్వయం రామ్-లక్ష్మణ్ పర్యవేక్షణలో హైదరాబాద్‌లోని అల్లుమియం ఫ్యాక్టరీలో చిరంజీవి, కొంతమంది ఫైటర్స్‌పై ప్రస్తుతం హై-ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నారు. యాక్షన్ సీక్వెన్స్‌ను గ్రాండ్ స్కేల్‌లో రూపొందిస్తున్నారు. విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్న ఈ మెగా ఫాంటసీ అడ్వెంచర్ రిచ్ ప్రొడక్షన్, అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో అద్భుతంగా ఉండబోతోంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి10న ఈ సినిమా విడుదల కానుంది.