సమైక్య పాలనలో ఉద్యోగులకు అన్యాయం

నవతెలంగాణ-సిటీబ్యూరో
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా టీఎన్జీవో హైదరాబాద్‌ జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ ఎస్‌.ఎం.హుస్సేని(ముజీబ్‌) ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యోగుల ధూంధాం కార్యక్రమం నాంపల్లిలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో ఉద్యోగులు హాజరయ్యారు. రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మెన్‌ ఆయాచితం శ్రీధర్‌, బీఆర్‌ఎస్‌ హైదరాబాద్‌ జిల్లా ఇన్‌చార్జి దాసోజు శ్రావణ్‌, టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్‌, ప్రధాన కార్యదర్శి జగదీశ్వర్‌, ట్రెసా రాష్ట్ర అధ్యక్షుడు వంగా రవీందర్‌రెడ్డి, నాలుగోతరగతి ఉద్యోగుల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఖాదర్‌ బిన్‌ హసన్‌ తదితరులు పాల్గొన్నారు.
బీఆర్‌ఎస్‌ హైదరాబాద్‌ జిల్లా ఇన్‌చార్జి దాసోజు శ్రావణ్‌, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మెన్‌ ఆయాచితం శ్రీధర్‌లు మాట్లాడుతూ ఒకప్పుడు సమైక్య పాలనలో తెలంగాణ ఉద్యోగులకు తీవ్ర అన్యాయం జరిగిందని, సమైక్య పాలకులు తెలంగాణ ఉద్యోగులను అణచివేశారనిపేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ ఆధ్వర్యంలో కోట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులకు అన్ని రకాలుగా న్యాయం జరిగిందని, అందరూ సంతోషంగా ఉన్నారని వారు తెలిపారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని గుర్తుచేశారు. టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్‌ మాట్లాడుతూ ప్రభుత్వం ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ ముందుంటుందని, తమ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించుకోవడానికి తాము ప్రయత్నం చేస్తామని తెలిపారు. హైదరాబాద్‌ జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ ముజీబ్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తుందని, ఉద్యోగులు కూడా ప్రభుత్వానికి పేరు తీసుకురావడానికి తమవంతు కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ తొమ్మిదేండ్లలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక పథకాలను పేదలకు అందేలా ఉద్యోగులు అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారని గుర్తుచేశారు. ఉద్యోగుల కోసం అనేక కార్యక్రమాలను చేపడుతున్నామని, అవన్నీ విజయవంతమయ్యాయని ఆయన తెలిపారు. రానున్న రోజుల్లో ఉద్యోగుల కోసం మరిన్ని మంచి కార్యక్రమాలు చేపట్టడానికి తాను కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా 25 మంది ప్రత్యేక తెలంగాణ కోసం పోరాడిన ఉద్యమకారులను సన్మానించారు. హైదరాబాద్‌ జిల్లాలోని(58) యూనిట్‌ అధ్యక్ష, కార్యదర్శులు, ప్రాథమిక సభ్యులకు ప్రత్యేక మెమోంటో అందజేసి సన్మానించారు. ఈ ధూంధాంలో భాగంగా ఆట, పాటలతో కళాకారులు ఉద్యోగులను అలరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఎస్‌.విక్రమ్‌ కుమార్‌, కోశాధికారి బాలరాజ్‌, అసోసియేట్‌ ప్రెసిడెంట్‌ కె.ఆర్‌.రాజ్‌ కుమార్‌, ఉపాధ్యక్షులు ఉమర్‌ ఖాన్‌, కుర్రాడి శ్రీనివాస్‌, నరేష్‌ కుమార్‌, హరిబాబు, ఖాలీద్‌ అహ్మద్‌, వైదిక్‌ శస్త్ర, శంకర్‌, సుజాత, గీతాసింగ్‌, శ్రీధర్‌ నాయుడు, ముఖిమ్‌ ఖురేషి, గెజిటెడ్‌ అధికారి వెంకట్‌ రెడ్డి, మాజీ స భ్యులు జానకి, సిహెచ్‌.వెంకటేష్‌, ప్రభాకర్‌, దేవేందర్‌ పాల్గొన్నారు. ఈ కార్యక్ర మానికి సుమారు 2వేల మంది ఉద్యోగులు వచ్చారు. ఈ కార్యక్రమం అనం తరం వచ్చిన అతిథులకు, ఉద్యోగులకు తెలంగాణ భోజనాలు ఏర్పాటు చేశారు.

Spread the love