చర్లపల్లి జైల్లో డ్రగ్స్ కోసం సిబ్బందిపై తిరగబడ్డ ఖైదీలు

నవతెలంగాణ-హైదరాబాద్ : చర్లపల్లి జైల్లో ఒక షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. జైల్లో ఉన్న సిబ్బందిపై కొందరు విచారణ ఖైదీలు తిరగబడ్డారు. డ్రగ్స్ కావాలని రచ్చ చేశారు. డ్రగ్స్ కు అలవాటు పడిన వీరు సిబ్బందిపై తిరగబడ్డారు. విషయం తెలుసుకున్న జైలు ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. ఆందోళన చేసిన విచారణ ఖైదీలను అదుపులోకి తీసుకుని ప్రత్యేక బ్యారక్ లోకి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Spread the love