లోపలి మనిషి..!

ఆమె అదష్టవంతురాలే..
అన్ని సుగుణాలే..
బతుకు దారిలో పూచిన వెలుగు దివ్వేలే..
అన్నింటికీ లోటులేనిదే..
అవసరాలకు అందరికి తలలో నాలిక
కన్నీటి కడలి లో ఒంటరి సముద్రం
కలిసి సాగిన తీరం వెంట
నడిచిన నీడ అదశ్యం అయ్యి..
ఏదో తెలియని కొత్త లోకం
తనని చుట్టేసిన అనుభవం
పాత కొత్త కలయికలో
ఇరుగు పొరుగు వాళ్ల సూటిపోటి
సూతి మెత్తని మాటల చురకత్తులు
కన్నీళ్లు జలపాతంల ఎత్తయిన
కష్టాల కొండల మధ్యలో
ఎగిసి పడుతుంటే..
అందరికి అదో విహార యాత్ర..
మరికొందరికీ విషాద యాత్ర..
కాలం చేసే గారడీ ఆటలో
ఆమె లోపలి మనిషి ఏదో
కావాలనుకుంటుంది..
బయటి బాహ్య ప్రపంచం
ఆమెని డబ్బులు ఉన్నా మనిషిగా
మార్కెట్‌ రంగుల చేపల
అద్దాల పెట్టలో
చూస్తున్న దశ్యం..
అవసరం తిరిపోయినట్లు..
అవసరం లేనట్లు,
వ్యక్తిత్వంకి విలువ లేనట్లు..
ఆమె ఇప్పుడు పంజరంలో రామచిలుక..
వంటింటి కుందేలు..
కుడిద లో పడ్డ ఎలుక పిల్లల కొట్టు మిట్టడుతున్నది..
చెప్పుకోవడాన్నికి ఎవరు ఉన్నారని..?
తోడుగా ఉంటానన్ని బాస చేసి..
ఒంటరి పక్షిని చేసి..
తన దారి చూసుకున్నాడు ..
మిగిలిన జ్ఞాపకాలు నెమరేసుకుంటూ.. బతకాలి ఊపిరి ఉన్నంతవరకు..
మరి ఆమె ఇప్పుడు
గొప్ప స్థితిలో ఉన్నదా..?
అర్థం పర్థం లేని మాటలు..
అవి ఎదుటి మనిషి అసూయ ద్వేషంకి
నిదర్శనం..
అయినా తెగిన గాలిపటం లాంటి..
గుండెల్లో మండే మంటను అర్పే దేవరు?
మనిషిగా లోపలి భావాలు అర్థం
చేసుకునేది ఎవరు..?
అది కాలమే చెప్పాలి..
డబ్బు కాదు ఉన్నత స్థితి కి అర్థం..
మనిషిగా గుర్తింపు..
మనసుకి ఓదార్పు
అనురాగంకి ఆలాపన..
అనుబంధంకి ఆరాధన..
ఆమె ని అర్ధం చేసుకొని
మనలో మనిషిగా కలుపుకొని
మనతో సాగే ప్రయాణంలో
మన అండ దండ అవసరం
ఆమె బాధకు మందు, ఒంటరి దిగులును
పోగేట్టే సహచర ప్రయత్నం..
ఆమె ఆలోచనలకి విలువ ఇచ్చి
ఆమె ఆత్మ సౌందర్యంకి పురుడు పోసినప్పుడే నిజమైన
వారసత్వ సంపద
అందించిన వాళ్ళం అవుతాం.!
అప్పుడు ఆమె హదయం
ఉప్పొంగిన గోదారి అవుతుంది..
ఆమె కలలు కన్నా పిల్లల ఎదుగుదలకి జీవన రాగం అవుతాయి..,,
జీవిత సత్యాన్నికి
తలమానికంగా నిలుస్తాయి.!!

– కొండా రవీందర్‌, 9059237771

Spread the love