నవతెలంగాణ దినపత్రిక నవతరానికి ప్రేరణగా అనేక రకాల విషయాలపై చక్కటి సమాచారాన్ని ఇస్తూ చైతన్య పరుస్తున్నది. ఈ పత్రిక తొమమిదో వార్షికోత్సవం సందర్భంగా యాజమాన్యానికి, సిబ్బందికి శుభాకాంక్షలు. ఈ పత్రిక ఇలాగే సమాజ మార్పునకు అనేక రకాల విషయాలపై ప్రజలను చైనత్యపరచాలి. రాజకీయంగా, సామాజిక, సాంస్కృతికంగా, అవగాహనను పెంచుతూ ముందుకెళ్లాలి. సమకాలీన రాజకీయ పరిస్థితుల్లో సాంకేతిక పరిజ్ఞానం విస్తరిస్తున్న సమయంలో ప్రపంచీకరణ కాలంలో ఇలాంటి ఆలోచన ధార కలిగిన పత్రికలు చారిత్రక అవసరం. ఇది పది కాలాలపాటు ప్రజలకు అండగ ఉండాలి.
– ఉన్నత విద్యామండలి చైర్మెన్ ఆర్ లింబాద్రి