20న ఓయూలో ‘ఇన్‌స్పైర్‌-2023’

– సివిల్‌ సర్వీసెస్‌ విజేతలతో ముఖాముఖి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
కుటుంబ నేపథ్యం ఏదైనా పట్టుదల, వ్యూహం ఉంటే సివిల్‌ సర్వీసెస్‌ సాధించడం సాధ్యమేనని నిరూపించిన సివిల్‌ సర్వీసెస్‌-2022 విజేతలతో ఉస్మానియా విశ్వవిద్యాలయం (ఓయూ) సహకారంతో బీసీ సంక్షేమ శాఖ టీఎస్‌బీసీ స్టడీసర్కిల్‌ ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. ఈ మేరకు ఆ స్టడీసర్కిల్‌ డైరెక్టర్‌ డి శ్రీనివాస్‌రెడ్డి మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈనెల 20న ‘ఇన్‌స్పైర్‌-2023’ పేరుతో ఓయూలోని ఠాగూర్‌ ఆడిటోరియంలో నిర్వహించే ఈ కార్యక్రమానికి బీసీ సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం ముఖ్యఅతిధిగా, ఓయూ వీసీ డి రవీందర్‌ గౌరవ అతిధిగా హాజరవుతారని తెలిపారు. సివిల్స్‌ సాధించే క్రమంలో ఎదురైన అనుభవాలను ఈ సందర్భంగా వారు విద్యార్థులతో పంచు కుంటారని పేర్కొన్నారు. పోటీపరీక్షలకు సిద్ధమవుతున్న వారందరితోపాటు ఓయూ విద్యార్థులంతా వినియోగించుకోవాలని కోరారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు బీసీ స్టడీసర్కిల్‌ అండగా ఉంటుందని తెలిపారు. వారి కోసం సివిల్‌ సర్వీసెస్‌ లాంగ్‌టర్మ్‌ కోచింగ్‌ ఇవ్వడానికి సన్నాహాలు జరుగుతున్నాయని వివరించారు.

Spread the love