హైదరాబాద్: వెల్‌నెస్ రంగంలోని రీతా డేట్ ఇటీవల తన ఆరోగ్య, సంక్షేమానికి చేసిన సేవలకుగాను నవభారత్ ‘ఇన్‌స్పైరింగ్ ఉమెన్ అవార్డ్’ను అందుకున్నారు. ఈ అవార్డును అమృతా ఫడ్నవీస్ నుంచి అందుకున్నారు. అవార్డులు అందుకున్న ఇతర ప్రముఖ విజేతలలో రిలయన్స్ ఫౌండేషన్ హెచ్‌ఎన్ సీఈఓ తరంగ్ గియాన్‌చందానీ, టాటా మోటార్స్ మార్కెటింగ్ హెడ్ పూజా ఆసార్ ఉన్నారు. రీతా రెండు దశాబ్దాలకుపైగా పోషకాహారం నిపుణురాలిగా సలహాలిస్తున్నారు.