వెంకటాంపల్లి లో సీసీ కెమెరాలు ఏర్పాటు..

– ప్రారంభించిన వేములవాడ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్..
నవతెలంగాణ – వేములవాడ రూరల్
వేములవాడ రూరల్ మండలం వెంకటాంపల్లి గ్రామం లో నాలుగు సీసీ కెమెరాల ను వేములవాడ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్  చేతుల మీదుగా ప్రారంభించటం జరిగింది అని ఎస్ ఐ మారుతీ తెలిపారు. ఈ సందర్బంగా ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతీ గ్రామం లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సీసీ కెమెరాల వల్ల దొంగతనాలు జరగకుండా ఉంటాయి అని తెలిపారు.కెమెరాలు ఏర్పాటు వల్ల నేర నియంత్రణ చట్టానికి కోర్టుకు, నేర విచారణ లో సీసీ కెమెరాలు ప్రముఖ పాత్ర వహిస్తాయి అని వెల్లడించారు. సీసీ కెమెరాలు వున్నా ప్రాంతాల్లో దొంగతనాలు తగ్గినాయి అని,నేర చేదనలో సీసీ కెమెరాలు ప్రముఖ పాత్ర వహిస్తున్నాయి అని అన్నారు. ఈ కార్యక్రమంలోవేములవాడ రూరల్ ఎస్ ఐ మారుతీ గ్రామస్తులతో పాటు తదితరులు పాల్గొన్నారు.
Spread the love