జడ్పీటీసీ, ఎంపీపీ నిధులతో సర్కిల్ పోల్ లైట్ల ఏర్పాటు

నవతెలంగాణ –  కమ్మర్ పల్లి
మండలంలోని బషీరాబాద్ లో జడ్పీటీసీ సభ్యురాలు పెరుమాండ్ల రాధా రాజా గౌడ్, ఎంపీపీ అధ్యక్షురాలు లోలపు గౌతమి అందించిన నిధులతో ఏర్పాటు చేసిన సర్కిల్ పోల్ లైట్లను బిగించినట్లు మాజీ సర్పంచ్ సక్కరం అశోక్ తెలిపారు. ఈ మేరకు గ్రామంలో రెండు చోట్ల జెసిబితో ఆదివారం సర్కిల్ పోల్ లైట్లను నిలబెట్టినట్లు తెలిపారు.గ్రామంలో మూడు నెలల క్రితం గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్కిల్ పోల్ లైట్లను ఏర్పాటు చేయడానికి తీర్మానం చేసినట్లు వివరించారు. అందులో భాగంగా పోచమ్మ గుడి వద్ద,  అంబేద్కర్ విగ్రహం వద్ద సర్కిల్ లైట్లను జడ్పీటీసీ, ఎంపీపీ నిధులతో పెట్టించడం జరిగిందన్నారు. అదేవిధంగా గ్రామంలో వివేకానంద విగ్రహం దగ్గర, కంబోడ వద్ద కూడా సర్కిల్ పోల్ లైట్లను ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. గ్రామంలోని ప్రధాన కూడళ్లలో సర్కిల్ పోల్ లైట్ల ఏర్పాటుకు నిధులు అందించిన  జడ్పీటీసి సభ్యురాలు పెరుమండ్ల రాధా రాజా గౌడ్, ఎంపీపీ అధ్యక్షురాలు లోలపు గౌతమి లకు  గ్రామస్తుల తరపున మాజీ సర్పంచ్ అశోక్  ధన్యవాదాలు తెలిపారు.
Spread the love