భీమా చేయించుకొని కుటుంబాలకు ధీమా ఇవ్వాలి 

భీమా చేయించుకొని కుటుంబాలకు ధీమా ఇవ్వాలి నవతెలంగాణ- వీర్నపల్లి:-
ప్రతి ఒక్క బ్యాంకు ఖాతాదారులు భీమా చేయించుకొని కుటుంబాలకు భరోసా ఇవ్వాలనీ బ్యాంకు మేనేజర్ భూపెందర్ అన్నారు. వీర్నపల్లి మండలం  తెలంగాణ గ్రామీణ బ్యాంకు మేనేజర్ భూపేంద్ర బదిలీపై వెళ్ళు సందర్భంగా మండల కేంద్రంలోని మహిళా సంఘ సభ్యురాలు, ప్రజాప్రతినిధులు, ఖాతాదారులు మేనేజర్ ఘనంగా సన్మానించి బదిలీపై వచ్చిన మేనేజర్ కు శాలువా కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా మేనేజర్ భూపెండదర్  మాట్లాడుతూ  మారుమూల ప్రాంతంలో బ్యాంకు మేనేజర్ గా పని చేసినందుకు నాకు సంతోషంగా ఉంది. ఖాతాదారుల అందరు సహకరించారు. ఇలాగే బ్యాంకు కొత్తగా వచ్చిన మానేజర్ సహకరించి వారి సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బదిలీపై వెళ్లడం ఎంతగానో బాధగా ఉన్న ప్రతి ఉద్యోగికి ట్రాన్స్ ఫర్  ఉండడం సహజమని మేము ఎక్కడైనా సేవలు అందించుటకు సిద్ధంగా ఉండాలని మా కొలువులో చేరేటప్పుడే నిర్ణయించుకొని ఉద్యోగంలో చేరామని  అన్నారు.  రుణమాఫీ వచ్చిన సందర్భంలో రైతులు వారి రుణాలను రెన్యువల్ చేసుకొని మిత్తి వాపసు వచ్చే విధంగా వారికి సహాయపడుతుంది. అదేవిధంగా వారు బ్యాంకుకు మంచి కస్టమర్ గా మిగిలిపోతారు. పంట, బిజినెస్, బంగారం రుణాలు తీసుకున్న  ఖాతాదారులు సరైన సమయానికి రినివల్ చేసుకొని సహకారం అందించాలన్నారు . ఈ కార్యక్రమంలో  ఏపిఎం నరసయ్య, మహిళా సంఘ సీసీలు  శ్యామల, సి ఎ లు పద్మ ,రాధ  బ్యాంకు  బ్యాంకు మేనేజర్ ఎం. ప్రేమ్ నాథ్, క్యాషియర్ శ్రావణ్ , ఫీల్డ్ ఆఫీసర్ రవివర్మ, సిబ్బంది షకీల్, బ్యాంకు మిత్ర లలిత, అశోక్ ఉన్నారు.
Spread the love