భూపాలపల్లి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మండలంలోని వల్లెంకుంట,కొయ్యుర్, దుబ్బపేట గ్రామాల్లో ప్రతి ఇంటికి తిరిగి ఫ్రై -డే డ్రై- డే కార్యక్రమంలొ భాగంగా ముమ్మరంగా పారిశుధ్య పనులు పంచాయతీ కార్యదర్శులు నరేశ్,ప్రసాద్, ప్రవీణ్ ఆధ్వర్యంలో చేపట్టారు. గ్రామ ప్రజల ఇండ్లలొ పాత టైర్లు, కూలర్లు, రోళ్లు, పగిలిన కుండలు, వాడి వదిలేసిన మద్యం సిషాలు, పూల కుండీలు మొదలైన వాటిలో నీరు నిల్వ కుండా చూడాలని,వాటిని ఎప్పటికప్పుడు బోర్లించి పెట్టాలని, నిత్యం వాడే డ్రమ్ లలో పరిశుభ్రమైన నీిని మాత్రమే నింపుకోవాలని చూచించి, త్రాగునీటిని కాచి చల్లార్చిన తరువాత మాత్రమే తాగాలని, తాజా వేడి ఆహారం మాత్రమే తినాలని ప్రజలకు సూచించడం జరిగింది ఈ కార్యక్రమంలొ పంచాయతీ పంచాయతీ సిబ్బంది, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.