నేటినుంచి మోడల్‌ స్కూళ్లలో ఇంటర్‌ ప్రవేశాలు

– ఆన్‌లైన్‌లో దరఖాస్తులకు ఆహ్వానం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలోని మోడల్‌ స్కూళ్లలో ఇంటర్‌ ప్రవేశాలకు మంగళవారం నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు మోడల్‌ స్కూళ్ల అదనపు సంచాలకులు సిహెచ్‌ రమణకుమార్‌ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలకు అర్హులని తెలిపారు. విద్యార్థులకు ఉచిత విద్యనందిస్తున్నామని పేర్కొన్నారు. ఎంసీపీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ కోర్సుల్లో ఒక్కో గ్రూపులో 40 సీట్ల చొప్పున ఉంటాయని వివరించారు. మంగళవారం నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. వాటి సమర్పణకు తుది గడువు ఈనెల 25వ తేదీ వరకు ఉందని పేర్కొన్నారు. పూర్తి షెడ్యూల్‌తోపాటు సమాచారం కోసం షషష.్‌రఎశీసవశ్రీరషష్ట్రశీశీశ్రీర.షశీఎ వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు.

Spread the love