– షెడ్యూల్ విడుదల
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 12వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శి నవీన్ మిట్టల్ బుధవారం షెడ్యూల్ను విడుదల చేశారు. అదేనెల 20వ తేదీ వరకు ఈ పరీక్షలు జరుగుతాయని తెలిపారు. ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, ద్వితీయ సంవత్సరం పరీక్షలు మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నిర్వహిస్తామని వివరిం చారు. అదేనెల ఐదు నుంచి తొమ్మిదో తేదీ వరకు ప్రాక్టికల్ పరీక్షలను నిర్వహిస్తామని పేర్కొ న్నారు. జూన్ 21న ఉదయం పది నుంచి మధ్యాహ్నం ఒంట ిగంట వరకు నైతికత, మానవ విలువలు పరీక్ష, 22న పర్యా వరణ విద్య పరీక్షను నిర్వహి స్తామని తెలిపారు. ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫీజు చెల్లింపు గడువు ఈనెల 19 వరకున్న విషయం తెలిసిందే.