ఆద్యంతం ఆసక్తికరం

గత ఏడాది ‘టాప్‌గన్‌ మావిరక్‌’ వంటి బ్లాక్‌బస్టర్‌తో అలరించిన హాలీవుడ్‌ కథానాయకుడు టామ్‌ క్రూజ్‌ లేటెస్ట్‌గా ‘మిషన్‌: ఇంపాజిబుల్‌-డెడ్‌ రికనింగ్‌ పార్ట్‌ 1’ సినిమాతో ప్రేక్షకుల ముందకు రాబోతున్నారు. ఈ సినిమా ఈనెల 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది. ఇది ‘మిషన్‌: ఇంపాజిబుల్‌ -ఫాల్‌ అవుట్‌’ (2018)కి సీక్వెల్‌. వయాకామ్‌ 18 స్టూడియోస్‌ ద్వారా ఇంగ్లీష్‌, హిందీ, తమిళం, తెలుగులో ఈనెల 12న విడుదలవుతోంది.
ఇందులో ఏతాన్‌ హంట్‌ (టామ్‌ క్రూజ్‌), అతని ఐఎమ్‌ఎఫ్‌ బృందం అత్యంత ప్రమాదకరమైన మిషన్‌ను ప్రారంభిస్తుంది. దీని వల్ల ఏం జరిగింది అనేదే సినిమా. ఈ సినిమాలోని యాక్షన్‌ సీక్వెన్స్‌ కోసం టామ్‌ క్రూజ్‌ పర్వతంపై బైక్‌ డ్రైవ్‌ చేస్తూ సాహసం చేశారు.
ఇందులో భాగంగా నార్వేలోని హెల్‌సెట్‌కోపెన్‌ పర్వతం, సముద్రం నుండి దాదాపు 1,200 మీటర్ల ఎత్తులో ఉన్న రాతి పై నుంచి ఆయన తన పారాచూట్‌ ఓపెన్‌ అవ్వడానికి ముందు 4,000 అడుగుల దిగువ లోయలో పడిపోయాడు. ఇప్పటివరకు చేయని అత్యంత ప్రమాదకరమైన స్టంట్‌ని టామ్‌ క్రూజ్‌ చేయటం విశేషం. వెండితెరపై మరోసారి ‘మిషన్‌ ఇంపాజిబుల్‌: డెడ్‌ రికనింగ్‌ పార్ట్‌ 1’ చరిత్ర సృష్టించడం ఖాయమని చిత్ర బృందం భావిస్తోంది. హేలీ అట్వెల్‌, వింగ్‌ రేమ్స్‌, సైమన్‌ పెగ్‌ వెనెస్సా కిర్బీ, హెన్రీ సెర్నీ నటించిన ఈచిత్రానికి సినిమాటోగ్రఫీ-ఫ్రేజర్‌ టాగర్ట్‌, సంగీతం-లోర్న్‌ బాల్ఫ్‌.

Spread the love