మధ్యంతర బెయిల్‌ ఇవ్వలేం

Interim bail cannot be granted– కేజ్రీవాల్‌ కేసులో సుప్రీం స్పష్టం
– సీబీఐకి నోటీసులు జారీ
– 23కు విచారణ వాయిదా
నవతెలంగాణ – న్యూఢిల్లీ బ్యూరో
మద్యం కుంభకోణానికి సంబంధించిన సీబీఐ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌కు బుధవారం చుక్కెదురైంది. ఆయనకు మధ్యంతర బెయిల్‌ ఇవ్వలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సీబీఐ అరెస్టుపై కేజ్రీ వాల్‌ పిటిషన్‌ను పరిశీలించేం దుకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ ఉజ్వల్‌ భుయాన్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం అంగీకరించింది. ఈ మేరకు ఆయన పిటిషన్‌పై సీబీఐకి కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ అంశంపై సీబీఐ ప్రతిస్పందన తెలపాలని కోరుతూ కేసు విచారణను ఈ నెల 23కి వాయిదా వేసింది. కేజ్రీవాల్‌ తరపున సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. ఇటువంటి ”ప్రత్యేక అరెస్టును బీమా అరెస్టు అని పిలుస్తారు. 2023 ఏప్రిల్‌ లో కేజ్రీవాల్‌ను సీబీఐ విచారించిన తర్వాత, ఈ ఏడాది మార్చిలో డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ (ఈడీ) ఆయనను అరెస్టు చేసింది. ఈడీ కేసులో బెయిల్‌ ఆదేశాలు కూడా పొందారు. మరికొన్ని గంటల్లో విడుదలకానున్న సమయంలో సీబీఐ అరెస్ట్‌ చేసింది. ఈ అరెస్టుకు ఎలాంటి కారణం లేదని, మే 10న మనీలాండరింగ్‌ నిరోధక కేసు (పిఎమ్‌ఎల్‌ఎ)లో ఆయనకు మధ్యంతర బెయిల్‌ లభించింది. తర్వాత జూలైలో సుప్రీంకోర్టు నుంచి మధ్యంతర బెయిల్‌ లభించింది. సీబీఐ కేసులో కింది కోర్టు కూడా బెయిల్‌ మంజూరు చేసింది. ఇలా మూడు బెయిల్‌ ఆదేశాలు పొందారు” అని సింఘ్వి అన్నారు.

Spread the love