అంతర్జాతీయ ధరిత్రి దినోత్సవం సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయుడు, ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఉదావత్ లచ్చిరాం మండలంలోని తేరట్పల్లి పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులతో కలిసి సోమవారం మొక్కను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ భూతాపాన్ని తగ్గించడానికి విరివిరిగా మొక్కలు నాటాలనీ, సమస్త ప్రాణికోటికి జీవన ఆధారం భూమి అని, అటువంటి భూమి కాలుష్యం కాకుండా చూసుకోవాలని, భూమి మీద పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, మనిషి తన స్వార్థంతో అడవులను నరకవద్దని, జంతువులు మనుషులకు జీవావరణం భూమి అని అటువంటి భూమిని వేడెక్కకుండా కాపాడుకోవాలని అందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపు నిచ్చారు. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణ పై విద్యార్థులకు అవగాహన కలిగించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు,సధాకర్ రెడ్డి ఉపాధ్యాయులు వెంకటేశ్వరరావు, సాయిరాం, నరసింహ, రాణి,మల్లేశం, వెంకటేశ్వర్లు విద్యార్థులు పాల్గొన్నారు.
తేరట్పల్లి పాఠశాలలో ఘనంగా అంతర్జాతీయ ధరిత్రి దినోత్సవం
నవతెలంగాణ – చండూరు