హైదరాబాద్‌ ప్రజలకు షాక్.. నగరం లో ఇంటర్నెట్ బంద్

నవతెలంగాణ – హైదరాబాద్: హైదరాబాద్ ఇంటర్నెట్ సేవలు బంద్ అయ్యాయి. అయితే హైదరాబాద్ మొత్తం నగరానికి ఇంటర్నెట్ సేవలు బంద్ కాలేదు కానీ కొన్ని ప్రాంతాల్లో మాత్రం… అంతరాయం ఏర్పడింది. హైదరాబాద్ వ్యాప్తంగా కరెంటు స్తంభాలపై ఉన్న కేబిల్స్ ను విద్యుత్ శాఖ సిబ్బంది తొలగించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రసార సేవలకు అంతరాయం ఏర్పడిందని అధికారులు ప్రకటించారు. తమకు ఎలాంటి నోట్స్ ఇవ్వకుండానే ఫైబర్ కేబుల్స్ కట్ చేయడంతో హైదరాబాద్ మొత్తం ఇంటర్నెట్ అలాగే కేబుల్ టీవీ లు డౌన్ అయ్యాయని ఈ కేబుల్ ఆపరేటర్లు గగ్గోలు పెట్టడం జరుగుతుంది. మరోవైపు ఇంటర్నెట్ అలాగే ఫైబర్ నెట్ ప్రొవైడర్స్ అసోసియేషన్ సభ్యులను కూడా తెలంగాణ విద్యుత్ శాఖ ఆఫీసులో చర్చలకు ఆహ్వానించారు.

Spread the love