నవ తెలంగాణ-రామగిరి: ఆర్జీ-3 ఏరియా జీఎం కార్యాలయంలో ఎస్‌వోటు జీఎం జి రఘుపతి ఆధ్వర్యంలో వృత్తి శిక్షణ అభ్యర్థులకు మంగళవారం ఏజీఎం (ఫైనాన్స్) పి శ్రీనివాసులు, డీజీఎం (ఐఈ) కె చంద్రశేఖర్, పర్సనల్ మేనేజర్ ఎం.రవీందర్ రెడ్డి, కోఆర్డినేటింగ్ అధికారి గుర్రం శ్రీహరి ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఆర్జీ-3 ఏరియా ఉద్యోగుల మహిళా కుటుంబ సభ్యులు, పరిసరా ప్రాంతాల మహిళలు 23 మంది హాజరయ్యారని ఎస్‌వోటు జీఎం తెలిపారు.