మత్తెక్కింది..నిజమే

– బెంగళూరు రేవ్‌ పార్టీలో తెలుగు నటి సహ 86 మందికి డ్రగ్‌ పాజిటివ్‌ : పోలీసులు
బెంగళూరు: బెంగళూరు రేవ్‌ పార్టీలో పట్టుబడిన వారిలో తెలుగు నటి సహ 86 మందికి డ్రగ్‌ పాజిటివ్‌గా నమోదైంది. రేవ్‌ పార్టీ రచ్చకెక్కాక అక్కడ తాము లేమంటూ వీడియోలు కూడా విడుదల చేశారు. తాజాగా ఆ నటి డ్రగ్స్‌ పాజిటివ్‌ అని తేలటంతో తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది. ఇంకెంతమంది డ్రగ్స్‌ తీసుకున్నారని వెల్లడిస్తారో.. నన్న ఉత్కంఠ నెలకొంది. అయితే ఈ రేవ్‌ పార్టీలో పట్టుబడ్డ వారిలో 103 మందికి డ్రగ్‌ టెస్ట్‌లో పాజిటివ్‌గా తేలినట్టు బెంగళూరు పోలీసులు వెల్లడించారు. పలువురు నటుల రక్త నమూనాల్లో మాదక ద్రవ్యాల ఆనవాళ్లు లభ్యమైనట్టు తెలిపారు. నగర శివారులో ఆదివారం రాత్రి నిర్వహించిన రేవ్‌ పార్టీని పోలీసులు భగం చేసిన విషయం తెలిసిందే. తెలుగు సినీ రంగానికి చెందిన కొందరు నటులు, బుల్లితెర నటులు, మోడల్స్‌, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరైనట్టు పోలీసులు ఇప్పటికే వెల్లడించారు. వారంతా మత్తు పదార్థాలు తీసుకున్నారో.. లేదో పరీక్షించడానికి రక్తనమూనాలు సేకరించి ప్రయోగశాల కు పంపించామని తెలిపారు. ఈక్రమంలో తాజాగా డ్రగ్స్‌ పరీక్షల వివరాలు వెల్లడించారు.

Spread the love