తోషఖానా, అల్‌-ఖదిర్‌ ట్రస్టు కేసుల్లో ఇమ్రాన్‌పై విచారణ

ఇస్లామాబాద్‌ : సిఫర్‌ కేసులో అరెస్టయి ఇప్పటికే అదియాలా జైల్లో వున్న మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ను తోషఖానా బహుమతుల కేసులో, అల్‌-ఖదిర్‌ ట్రస్టు కేసులో కూడా అవినీతి నిరోధక బ్యూరో అధికారులు అరెస్టు చేసినట్లు మీడియా వార్తలు మంగళవారం తెలిపాయి. అరెస్టు వారంట్లను అకౌంటబిలిటీ కోర్టు జడ్జి మహ్మద్‌ బషీర్‌ ధృవీకరించి, వెంటనే అమలు చేయాల్సిందిగా అదియాలా జైలు సూపరింటెండెంట్‌ను ఆదేశించడంతో సోమవారం ఎన్‌ఎబి (నేషనల్‌ అకౌంటబిలిటీ బ్యూరో) అధికారులు అరెస్టు చేశారని డాన్‌ వార్తా పత్రిక పేర్కొంది.

Spread the love