– తెలంగాణ యూనివర్సిటీ పిడిఎస్ యూ కమిటీ డిమాండ్..
నవతెలంగాణ డిచ్ పల్లి
తెలంగాణ యూనివర్సిటీ లో అక్రమ పిహెచ్ డి లపై విచారణ జరిపించి వాస్తవాలను బయటికి తియాలని తెలంగాణ యూనివర్సిటీ పిడిఎస్ యూ కమిటీ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నామని వారన్నారు. శుక్రవారం తెలంగాణ యూనివర్సిటీ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పిడిఎస్ యూ అధ్యక్షుడు సంతోష్ మాట్లాడుతూ పిహెచ్ డి అక్రమాల పై పాలకమండలి తీసుకున్న తీర్మానాలపై , యూనివర్సిటీలో విచారణ జరిపించకుండా ఎందుకు జాప్యం చేస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో పిహెచ్డి సీట్ల కేటాయింపులు, అక్రమ పిహెచ్డి లపై సమగ్ర విచారణ జరపాలని, గతంలో జరిగిన పాలకమండలి సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానం జరిపి దాదాపు నెల రోజులు కావస్తున్నా ఇంతవరకు విచారణ జరుపకపోవడం అనేక అనుమానాలకు తావిస్తుందని సంతోష్ అన్నారు. వెంటనే పిహెచ్డి అక్రమాలపై విచారణ మొదలుపెట్టి అక్రమార్కులపై చర్యలు తీసుకోకపోతే పిడిఎస్ యు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో నాయకులు అక్షయ్, భరత్ చంద్ర, రణధీర్ తదితరులు పాల్గొన్నారు.