– జులై 15 వరకు రిజిస్ట్రేషన్‌కు అవకాశం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఈ ఏడాదికి జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల కోసం రాష్ట్రంలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, ఎయిడెడ్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయుల నుంచి కేంద్ర విద్యాశాఖ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నదని పాఠశాల విద్యాశాఖ సంచాలకులు శ్రీదేవసేన బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. వచ్చేనెల 15లోగా http://nationalawardstoteachers.education.gov.in వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అవకాశముందని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ఉపాధ్యాయులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆ వెబ్‌సైట్‌ను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోవాలని కోరారు.