ప్రధానమంత్రి రాష్ట్రీయ బాలపురస్కార్‌ జాతీయ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం

నవతెలంగాణ-హైదరాబాద్ : మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం తరఫున అందించే ప్రధానమంత్రి రాష్ట్రీయ బాలపురస్కార్‌ జాతీయ అవార్డులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కొమరంభీం జిల్లా మహిళా, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ అధికారి భాస్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. 2024– 25 సంవత్సరానికి రాష్ట్రీయ బాల పురస్కార్‌ అవార్డులకు 6 నుంచి 18 ఏళ్ల బాలబాలికలు అర్హులని పేర్కొన్నారు. ఆవిష్కరణలు, సృజనాత్మకత, సామాజిక సేవ, పర్యావరణం, క్రీడలు, కళలు, సంస్కృతి, సైన్స్‌, టెక్నాలజీ, ఇతర రంగాల్లో ప్రతిభ చూపిన బాలల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నామని తెలిపారు. ఆసక్తి గల వారు జూలై 31లోగా https://awards.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు 94914 60658 నంబర్‌లో సంప్రదించాలని కోరారు.

Spread the love