అతిథి అధ్యాపక ఫిసికల్ డైరెక్టర్ దరఖాస్తుల ఆహ్వానం 

నవతెలంగాణ – మాక్లూర్ 
మండలంలోని దాస్ నగర్ సమీపంలో గల జిల్లా తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళా గురుకుల డిగ్రీ కళాశాల నందు  ఫిజికల్ డైరెక్టర్ పోస్ట్ ఖాళీగా ఉందని ప్రిన్సిపల్ డాక్టర్ ధాత్రిక  వెంకటేశ్వరరావు మంగళవారం తెలిపారు. సంబంధిత సబ్జెక్టులో ఎం పి. ఎడ్ లో 55% మార్కులు సాధించిన వారు అర్హులని, తాత్కాలిక పద్ధతిన పనిచేయుటకు ఆసక్తి కలిగిన, మహిళా అభ్యర్థులు తమ సర్టిఫికెట్లను తీసుకొని 16-10-2024 న 10:30కి కళాశాలకు రావలసిందిగా ప్రిన్సిపాల్ తెలిపారు.
Spread the love