ఉచిత శిక్షణ కొరకు ధరఖాస్తుల ఆహ్వానం

నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
తెలంగాణ షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ, అద్వర్యం లో నిర్వహిస్తున్న యస్. సి స్టడీ సర్కిల్  బ్యాంకింగ్ సర్వీసెస్, స్టాఫ్ సెలక్షన్ కమీషన్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భర్తీ చేయనున్న ఉద్యోగాల పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ కోసం గడువు ఈ నెల 6 వరకు ఉన్నదని   స్టడీ సర్కిల్ హానరరీ డైరెక్టర్ సిహెచ్ రాములు శుక్రవారం  ఒక ప్రకటనలో తెలిపారు.ఆసక్తి గల అభ్యర్థులు www.tsstudycircle.co.in  వెబ్ సైట్ లో ధరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.ఎంట్రన్స్ పరీక్ష ఈ నెల 10 ఆదివారం ఉ” 11:00 గo” ల నుండి మ”1:00 వరకు నిర్వహిస్తారని తెలిపారు. హాల్ టికెట్లు 7 తేదిన డౌన్ లోడ్ చేసుకోవాలని పేర్కొన్నారు. యస్.సి, యస్.టి, బి.సి, మైనారిటీ కులాలకు చెందిన నలబై ఏళ్ళ లోపు వయసు కలిగి డిగ్రీ ఉత్తీర్ణులై, సంవత్సరానికి రూ. మూడు లక్షలు లోపు కుటుంబ ఆదాయం కలిగిన అభ్యర్థులు అర్హులని  తెలిపారు.ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 18 నుండి ఆగష్టు 17 వరకు భోజన వసతి కల్పించి శిక్షణ ఇస్తారు అని తెలిపారు.ఇతర సమాచారం కొరకు హనరరీ డైరెక్టర్ సి హెచ్ రాములు ఫోన్ నెంబర్ 9989129935   సంప్రదించాలని సూచించారు.
Spread the love