టీచింగ్ పోస్టుల కోసం దరఖాస్తుల ఆహ్వానం…

– మైనార్టీ గురుకులంలో…..
– ప్రిన్సిపాల్ లిల్లీ సుజన్ శారా
నవతెలంగాణ అశ్వారావుపేట:  తెలంగాణ అల్ప సంఖ్యాక వర్గాల(మైనారిటీ) గురుకులాలు కు చెందిన అశ్వారావుపేట బాలికల కళాశాల లో ఖాలీ పోస్టులకు భర్తీ చేయడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ కె.లిల్లీ సుజన్ శారా గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. పురుషులు సెక్యూరిటి గార్డు, (ఎస్.జి – 3), ఉర్దూ సబ్జెక్టు బోధనకు జూనియర్ లెక్చరర్ మహిళా అభ్యర్థి పోస్టులను భర్తీ చేయుటకు గాను దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ కె. లిల్లీ సుజన్ శారా ఒక ప్రకటనలో తెలియజేశారు. ఆసక్తి,అర్హత గల అభ్యర్థులు ఈ నెల 2 వ తారీఖు నుండి 6 వ తారీఖు వరకు కళాశాల పని దినాలలో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల లోపు దరఖాస్తుల ను సమర్పించాలని కోరారు. ఇతర వివరాలకు 7207998965 ఫోన్ నంబర్ కు సంప్రదించగలరు.
Spread the love