సాహిత్య కళా ఉత్సవాలకు అంబేద్కర్ కు ఆహ్వానం

నవతెలంగాణ – రాయపర్తి
అంతర్జాతీయ సాంస్కృతిక సామాజిక సేవ సంస్థ శ్రీశ్రీ కళావేదిక ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఉత్సవాలకు మండలంలోని గట్టికల్ గ్రామానికి చెందిన ప్రముఖ కవి, పాటల రచయిత ఇల్లందుల అంబేద్కర్ కు ప్రత్యేక ఆహ్వానం అందిన్నట్లు ఆయన సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా అంబేద్కర్ మాట్లాడుతూ అంతర్జాతీయ సాహిత్య కళా ఉత్సవాలను కత్తిమండ ప్రతాప్ సారధ్యంలో ఈ నెల 16,17 తేదీల్లో పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో జరుగానున్నట్లు తెలిపారు. ఉత్సవాలు నిర్విరామంగా 30 గంటలపాటు కొనసాగనున్నట్లు పేర్కొన్నారు. జాతీయ, అంతర్జాతీయ వేదికలపై పాల్గొని పలు పుస్తకాల్లో, యూట్యూబ్ ద్వారా ప్రజలను చైతన్య పరుస్తూ కవితలు పాటలు రాయడం జరిగిందని వివరించారు. ఉత్సవాలలో పాల్గొని కవిత, గానం లేదా కళా ప్రదర్శన చేస్తే వరల్డ్ రికార్డ్ లో తన పేరు నమోదు ఐయే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ అవకాశం కల్పించిన సంస్థ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలియజేశారు.
Spread the love