నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
అటవీ కళాశాల, పరిశోధనా సంస్థ(ఎఫ్‌సీఆర్‌ఐ)లో 2023-24 విద్యాసంవత్సరానికి గానూ బీఎస్సీ(ఆనర్స్) ఫారెస్ట్రీ నాలుగేండ్ల డిగ్రీ కోర్సులో చేరేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు రుసుం ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులకు రూ.1000, ఇతరులకు రూ.2000 చెల్లించి జులై 12లోపు దరఖాస్తు చేయాలని సూచించింది. రూ.500 ఆలస్య రుసుముతో జులై 15 వరకు అవకాశం ఇస్తున్నట్టు తెలిపింది. వెబ్‌సైట్ WWW.fcrits.in లో , 80743 50866/89194 77851 ఫోన్‌నెంబర్లనుగాని సంప్రదించాలని సూచించింది.