నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కి భవానీ ర్యాలీ కార్యక్రమానికి ఆహ్వానం చేసి ఆహ్వాన పత్రికను పబ్బ సాయిప్రసాద్ శనివారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ఎనిమిది సంవత్సరాలుగా నిజామాబాద్ నగరంలో భవాని మాలధారణ స్వాములను ఒక్కటి చేసే భాగంలో భవాని ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం కూడా తేది 21-10-2023 శనివారం నాడు సాయంత్రం 6 గంటలకు పోచమ్మ గల్లీ పోచమ్మ మందిరం నుండి దేవి రోడ్డు దేవి మందిరం వరకు అమ్మవారి మంచి పుల అలంకరణ తో భక్తి శ్రద్ధలతో ఈ తొమ్మిదవ సంవత్సర ర్యాలీ కూడా నిర్వహించడం జరుగుతుంది కావున స్వాములు మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవతం చేయగలరని ఇందూరు భవాని ర్యాలీ సమితి వ్యవస్థాపకులుపబ్బ సాయిప్రసాద్ కోరారు.