నవతెలంగాణ – హైదరాబాద్ : ఉప్పల్ స్టేడియం వేదికగా నేడు ముంబై ఇండియన్స్ – సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. బుధవారం రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా ఉప్పల్ మార్గంలో మెట్రో రైలు సమయం పొడిగించారు. ఇవాళ మెట్రో రైళ్లు నిర్ణీత సమయానికి మించి నడుస్తాయన్నారు. నాగోల్, ఉప్పల్ స్టేడియం, ఎన్‌జీఆర్ఐ స్టేషన్లలో చివరి రైళ్లు రాత్రి 12:15 గంటలకు బయల్దేరి 1:10 గంటలకు గమ్యస్థానాలకు చేరుకుంటుంది అని మెట్రో అధికారులు వెల్లడించారు.