ఈనెల 24న ఐపీఎల్ మెగా వేలం..!

నవతెలంగాణ – హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ -2025 మెగా వేలం ఈనెల 24 & 25వ తేదీల్లో సౌదీ అరేబియాలోని రియాద్‌లో జరగనుందని క్రికెట్ వర్గాలు పేర్కొన్నాయి. దీనికి బీసీసీఐ ఏర్పాట్లు చేస్తోందని, త్వరలో ప్రకటన చేస్తుందని వెల్లడించాయి. అయితే, అదే సమయంలో ఈనెల 22-26 వరకు పెర్త్‌లో ఆస్ట్రేలియాతో భారత్ మొదటి టెస్టును ఆడనుంది. ఈ మ్యాచ్ ప్రసారంతో పాటు ఐపీఎల్ వేలం ఈవెంట్ ప్రసారం చేయడంలో హాట్‌స్టార్‌ ఇబ్బందిపడే అవకాశం ఉంది.

Spread the love