రాఘవాపూర్‌ మట్టి తవ్వకాల్లో అక్రమాలు అవాస్తవం

నవతెలంగాణ-పెద్దపల్లి టౌన్‌: పెద్దపల్లి మండలం రాఘవాపూర్‌ గ్రామంలో ఇటుక బట్టీలకు తరలి స్తున్న మట్టిపై కొందరు కావాలని అసత్య ప్రచా రాలు చేస్తున్నారని దళిత లేబర్‌ అసోసి యేషన్‌ అధ్యక్షుడు బొంకూరి కైలాసం అన్నారు. బుధవారం ప్రెస్‌ క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేషంలో కైలాసం మాట్లాడుతూ, గతంలోనే వే బిల్లులు చెల్లించి నిల్వ చేసుకున్న మట్టిని నిబంధనల మేరకే ఇటుక బట్టీలకు యజమానులు తరలిస్తున్నారని తెలిపారు. ఒకే మట్టికి రెండుసార్లు వే బిల్లిలు చెల్లించడం ఉండదని, అధికారులు సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేశారని ధృవీకరించారు. ఈ విషయం తెలియని గ్రామస్తులు మట్టి తరలిస్తున్న వాహనాలను అడ్డుకొని రాద్దాంతం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బుల కోసం ఇటుక బట్టీల యజమానులను బెదిరించడం వల్ల బట్టీల్లో పనిచేసే కార్మికులకు ఉపాధి లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో నాయకులు అరికిల్ల లక్ష్మన్‌, దాసరి కిషన్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love