– విలువైన సాగునీరు మంజీర నదిలోకి
– చివరి ఆయకట్టుకు సాగునీరు అందేనా…?
నవతెలంగాణ – నసురుల్లాబాద్
నిజాంసాగర్ ప్రధాన కాలువ ఆయకట్టు ప్రాంతంలో వరిసాగుకు నీటి అవసరాలు పెరగడంతో.. చివరి భూములకు సాగునీరు అందక అన్నదాతలు నానా అవస్థలు పడుతున్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ డివిజన్ పరిధిలోని నసురుల్లాబాద్, బీర్కూర్ మండల పంట పొలాలకు తీవ్ర నీటి ఎద్దడి ఎదురవుతోంది. సాగునీటి అధికారుల నిర్లక్ష్య కారణంగా ఎంతో విలువైన సాగునీరు నిరుపయోగంగా పిల్ల కలల ద్వారా మందిరం నదిలోకి వెళ్తుంది అలాగే కొన్ని ప్రాంతాల్లో సాగునీరు లేక పంటపొలాలు ఎండిపోతున్నాయి అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్లనే ఇలా సాగునీరు వృధా అవుతుందని రైతులు ఆరోపిస్తున్నారు.ప్రారంభంలోనే ఇలా ఉంటే సాగు సాగేదెలా అన్న ఆందోళన రైతుల్లో నెలకొంది. నసురుల్లాబాద్ బీర్కూర్ మండల భూముల్లో తీవ్ర సాగు నీటి ఎద్దడి ఏర్పడింది. నసురుల్లాబాద్ మండలం మిర్జాపూర్ ఆయకట్టు పరిధిలో 200 ఎకరాల్లో వరి పంట సాగు చేస్తున్నారు. మిర్జాపూర్ ఊర చెరువు పూర్తి స్థాయిలో నిండక పోవడంతో చెరువు ఆయకట్టు భూములకు సాగునీరు అందక బీడుగా మారుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిజాంసాగర్ ప్రధాన కాలువ నుంచి వచ్చే నీరే తమ పంటలకు ఆధారమని చెబుతున్నారు. 25వ డిస్ట్రిబ్యూటర్ కాలువ ద్వారా మైలారం మీర్జాపూర్ బీర్కూరు ప్రధాన చెరువులు నిండుతాయి ఈ చెరువుల కింద ఉన్న పంట పొలాలకు సాగునీరు అందుతుంది. ఈ సంవత్సరం 25వ డిస్ట్రిబ్యూటర్ కాలువ గండ్లు కొట్టడంతో సాగునీరు వృధాగా పోతుంది. మిర్జాపూర్ చెరువులోకి రావాల్సిన సాగునీరు రాకపోవడంతో దాని కింద ఉన్న ఆయకట్టు భూములు బీడు గా మారే అవకాశం ఉందని రైతులు ఆవేదన మీద చేస్తున్నారు సాగునీరు వస్తుందని ఆశతో వరి నాట్లు వేసుకున్నామని గత కొన్ని రోజుల నుంచి నిజాంసాగర్ కాలువ నీళ్లు విడుదల అయినప్పటికీ తమకు నీరు అందడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం మండల ప్రజా ప్రతినిధులకు నాయకులకు అధికారులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చిన కనీసం చూసేవారు లేరని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాగునీరు వస్తుందని ఆశతో అధిక వడ్డీకి అప్పులు చేసి పంట సాగు చేస్తుండగా అధికారుల నిర్లక్ష్య కారణంగా తమ పంట పొలాలకు సాగునీరు అందడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిర్జాపూర్ శివారు భూములకు సాగు నీరు అందడం లేదని రైతులు చెబుతున్నారు. నీటి సరఫరా అంగుళం కూడా మించక పోవడంతో.. సాగు కష్టమవుతోందని అంటున్నారు. ఏటా తమకు ఇదే దుస్థితి ఎదురవుతోందని రైతులు వాపోతున్నారు. పంట ప్రారంభంలోనే ఎండి పోతుండటంతో ఆందోళన చెందుతున్నారు. ఎండలు పెరుగుతుండటం, శివారు ప్రాంతాల్లో ఇప్పటికే నీటి ఎద్దడి ఎదురవ్వడంతో గ్రామంలో వరి పంట ఎలా పూర్తవుతుందన్న ఆందోళన సాగుదారుల్లో నెలకొంది. అధికారులు చొరవ చూపి శివారు ప్రాంతాల వరకు సాగునీరు అందేలా చర్యలు చేపట్టాలని… రైతలు కోరుతున్నారు.